రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా చంద్రబాబు ఆదేశాలతో... మైలవరం తెదేపా కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. వైకాపా అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరిగాయని.. దీనికి నిదర్శనం ముదినేపల్లిలో ఎస్సీ మహిళ సజీవ దహన యత్నం అని పేర్కొన్నారు.
'వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగాయి' - దేవినేని ఉమా తాజా వార్తలు
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరిగాయని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఎస్సీలపై దాడులకు నిరసనగా మైలవరంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవినేని పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన దాడి ఘటనలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ డాక్టర్ సుధాకర్‌పై దాడి, గుంటూరు జిల్లాలో మాస్క్ లేదని ఎస్సీ యువకుడి మరణం మొదలైనవి నిదర్శనంగా నిలుస్తున్నాయని దేవినేని వివరించారు. ఈ ఘటనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని స్పష్టం చేశారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని చదువు నేర్పిన గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులు సరికాదు'