ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరాన్ని కేంద్రమే పూర్తిచేయాలి: తులసి రెడ్డి

ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి.. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని విజయవాడలో డిమాండ్ చేశారు.

మీడియాసమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి

By

Published : Aug 3, 2019, 6:04 PM IST

Updated : Aug 3, 2019, 7:42 PM IST

మీడియాసమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి

రాష్ట్రానికి దక్కిన వరం పోలవరం ప్రాజెక్టు అని.. ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తి చేస్తుందని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారి ప్రాజెక్టు వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం చట్టప్రకారం పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కాసుల కోసం కక్కుర్తితో పోలవరం బాధ్యతలు తమ నెత్తిపై వేసుకున్నాయని ఆరోపించారు. విభజన చట్టం సెక్షన్ 90 ద్వారా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకుని ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Last Updated : Aug 3, 2019, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details