ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే.. జగన్ అమెరికా వెళ్లారు - ycp

రాష్ట్రం వరదల్లో చికుకుని అల్లాడుతుంటే ముఖ్యమంత్రి తన కుమార్తె సీటు కోసం అమెరికా వెళ్లటం బాధాకరమని తులసిరెడ్డి విమర్శించారు.

తులసి రెడ్డి

By

Published : Aug 17, 2019, 3:55 PM IST

రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే.. జగన్ కుమర్తె కోసం అమెరికా వెళ్లారు

రాష్ట్రాన్ని వరదలకు వదిలేసి ముఖ్యమంత్రి అమెరికా వెళ్లారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి విమర్శించారు. ప్రజలను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. అధికార, ప్రతిపక్షాలు చిల్లర, రొచ్చు రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. జగన్ మంత్రివర్గ సహచరులు వరద గురించి పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి నివాసం మునుగుతుందా? లేదా ? అని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగడం తప్ప మరో పని లేదా అని ప్రశ్నించారు. మామూలు పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటనకు వెళ్ళవచ్చుగాని.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాలికొదిలి అమెరికా వెళ్లటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు.

ABOUT THE AUTHOR

...view details