ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మూడు రాజధానులతో ముమ్మాటికి ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు'

హోదా, పునర్విభజన చట్టంలోని హామీలపై సీఎం జగన్​కి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా,విభజన హామీల హక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు.

Breaking News

By

Published : Aug 17, 2020, 9:30 AM IST


ప్రత్యేక హొదా, విభజన హామీలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి నేడు మాట్లాడుతున్న మాటలు ఎన్నికల ముందు మాట్లాడాల్సిందని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. హోదా, పునర్విభజన చట్టంలోని హామీలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు.. ప్రత్యేక హోదా, విభజన హామీల హక్కు ఆంధ్రుల హక్కు అని పునరుద్ఘాటించారు. మూడు రాజధానులతో ముమ్మాటికి ఏ ప్రాంతం అభివృద్ధి చెందదని అది కేవలం విభజన చట్టంలోని హామీలతోనే సాధ్యమని స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details