ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యపాన నిషేధం...మహిళలకు వరం: వాసిరెడ్డి పద్మ

సమాజంలోని అనేక రంగాల్లో ముందడుగు వేస్తోన్న మహిళలకు సామాజిక భద్రత పెద్ద అవరోధంగా మారిందని మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతకు కమిషన్ ద్వారా అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న మద్యపాన నిషేధం మహిళలకు వరమని పేర్కొన్నారు.

మద్యపాననిషేధం...మహిళలకు వరం : వాసిరెడ్డి పద్మ

By

Published : Sep 7, 2019, 4:41 PM IST

మద్యపాననిషేధం...మహిళలకు వరం : వాసిరెడ్డి పద్మ
మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధిగమించేందుకు సమిష్టి కృషి అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పర్యటించిన ఆమె... ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్​ ద్వారా మహిళల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. వివిధ రంగాల్లో దూసుకుపోతున్న మహిళలకు... భద్రత పెద్ద అవరోధంగా మారిందన్నారు. ప్రభుత్వం తలపెట్టిన దశలవారీ మద్యపాన నిషేధం మహిళలకు పెద్ద వరమన్నారు. వాసిరెడ్డి వెస్లీ, పద్మ దంపతులకు ఉదయభాను దంపతులు ఆత్మీయ సత్కారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details