ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా హయాంలో.. అవనిగడ్డ అభివృద్ధి పథం! - AVANIGADDA

“పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పని చేశా. ఈసారి జరిగినంత అభివృద్ధి, సంక్షేమం ఎన్నడూ లేదు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. తెదేపాను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.” - మండలి బుద్ధప్రసాద్

అభివృద్ధి పథంలో అవనిగడ్డ.....

By

Published : Apr 1, 2019, 7:11 PM IST

అభివృద్ధి పథంలో అవనిగడ్డ.....
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ...ఐదేళ్ల పాటు పని చేశామన్నారు తెదేపా అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్.విద్య,వైద్యం వంటి మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేపట్టామని చెప్పారు.కాంగ్రెస్​లో ఉండగా పదేళ్లలో చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంతో ఐదేళ్లలో చేయగలిగానన్నారు.

అభివృద్ధి పథంలో అవనిగడ్డ

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ తరఫున2సార్లు మండలి బుద్ధప్రసాద్ విజయం సాధించారు.గత ఎన్నికల్లో తెదేపా నుంచి మరోసారి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు,రెండువేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ నియోజకవర్గ ప్రగతి నివేదిక ప్రకటించారు మండలి బుద్దప్రసాద్.

ప్రగతి నివేదికలోని అంశాలు:

  • నియోజకవర్గంలో మొత్తంగా రూ.1000కోట్ల అభివృద్ధి పనులు

  • సంక్షేమ పథకాల ద్వారా రూ. 2000కోట్ల ఖర్చు

  • రూ. 79కోట్లతో ఉల్లిపాలెం-భవానీపురం వంతెన నిర్మాణం

  • సుమారు రూ.125కోట్లతో గ్రామాల్లో తాగునీటి ప్రాజెక్టులు

చంద్రన్న బీమా ద్వారా రూ. 56.24కోట్ల ఆర్థిక సాయం

  • పసుపు-కుంకుమ ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.115కోట్లు మంజూరు

  • చల్లపల్లిలో రూ.40లక్షలతో రైతుబజార్​ నిర్మాణం

  • రూ. 230కోట్లతో అంతర్గత రహదారులు,సీసీ రోడ్ల నిర్మాణం

  • ఘంటసాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

  • ఎన్టీఆర్ గృహకల్ప ద్వారా5, 802ఇళ్ల నిర్మాణం,మరో1, 600ఇళ్లు మంజూరు

  • ఇవి చదవండి

    ఏప్రిల్​ 11న మాత్రం ఫూల్​ కావొద్దు: కేశినేని నాని

    For All Latest Updates

    ABOUT THE AUTHOR

    ...view details