ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంపై వయో భారం... తగ్గుతున్న యువతరం...

దేశంలో జనాభా నానాటికి తగ్గుతోందని... 2041 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధి రేటు జీరోకి చేరుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. వచ్చే రెండు దశాబ్దాల్లో తెలుగురాష్ట్రాల్లో టీనేజీ పిల్లల సంఖ్య 10 శాతం తగ్గి... 60 ఏళ్లుపైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరగనుంది. భేటీ బచావ్, బేటీపడావ్‌తో లింగనిష్పత్తి మెరుగుపడింది. ఇదే సమయంలో ఆయుప్రమాణాలు పెరుగుతున్నాయి.

By

Published : Jul 5, 2019, 6:10 AM IST

ఆంధ్రప్రదేశ్ సర్వే

2031-41 కల్లా ఏపీలో జనాభా వృద్ధి రేటు దాదాపు జీరోకి చేరుతుందని లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది.
జనాభా వృద్ధి రేటు ఇలా

  • 2001-11లో జనాభా వృద్ధి రేటు 1.10 శాతం
  • 2011-21లో జనాభా వృద్ధి రేటు 0.65 శాతం
  • 2021-31లో జనాభా వృద్ధి రేటు 0.31శాతం
  • 2031-41లో జనాభా వృద్ధి రేటు 0.02 శాతం
  • 2021-41లో జనాభా వృద్ధి రేటు 3.4 శాతం
  • 2041 నాటికి ఏపీ జనాభా 5.43 కోట్లు

పెరగనున్న వయోవృద్ధులు.. తగ్గనున్న యువతరం...

  • 2011 నాటికి 0-19 వయసున్న పిల్లల శాతం 34.8
  • 2041 నాటికి 0-19 వయసున్న పిల్లల శాతం 21.4
  • 2041 నాటికి 22-59 వయసున్న వారి జనాభా 55.1 నుంచి 58.6శాతం
  • 2041 నాటికి 60 ఏళ్ల పైబడిన వారి జనాభా 10.1 నుంచి 20 శాతం
  • 20 ఏళ్లలో యువతరం సంఖ్య 13 శాతం తగ్గనుంది
  • 60 ఏళ్లపైబడిన వారి సంఖ్య 10 శాతం తగ్గనుంది.
  • యుక్తవయసు వారి సంఖ్యం 3.5 శాతం వృద్ధి

లింగనిష్పత్తి తగ్గుముఖం

  • 2001-2011 మధ్యలో తగ్గిన లింగనిష్పత్తి
  • 2015-16 నుంచి 2018-19 మధ్య లింగ నిష్పత్తి పురోగమనం
  • బేటీ బచావ్ బేటీ పడావ్ పథకంతో మెరుగైన ఫలితాలు
  • లింగ నిష్పత్తి 980 మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ

ప్రభుత్వ పథకాల వివరాలు తెలియజేసేందుకు ఏపీ, బంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో జిల్లా స్థాయి డాష్ బోర్డులు ఏర్పాటు చేశాయని. ఏపీ, బంగాల్ డాష్ బోర్డులే సులభంగా అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. జిల్లా సెషన్స్ కోర్టులో అతితక్కువ కాలం కేసులు పెండింగ్ ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీది నాల్గో స్థానం పంజాబ్‌లో కేసులు సగటున రెండేళ్లలో పరిష్కారమవుతుండగా ఏపీలో రెండున్నరేళ్లు పడుతుంది. కింది కోర్టుల్లో కేసు ఒక విచారణకు మరొక విచారణకు మధ్య సగటున 40 రోజులకుపైగా సమయం తీసుకుంటుంది. కేసు క్లియరెన్స్ రేటులో ఏపీ ఆరో స్థానంలో ఉంది. ఈ విషయంలో గుజరాత్, ఛాత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ తొలి 3స్థానాల్లో ఉన్నాయి. మొత్తం సంతాన సాఫల్య నిష్పత్తి ఏపీ, తెలంగాణతోపాటు దిల్లీ, బంగాల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో 1.6-1.7కి చేరింది. బిహార్, ఝార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, ఉత్తరాఖండ్‌లలోనూ కొన్నేళ్లుగా సంతానసాఫల్య నిష్పత్తి వేగంగా తగ్గుతూ వస్తోంది. ఏపీలో 2001లో సగటు సంతాన సాఫల్య నిష్పత్తి 2.3 శాతం ఉండగా 2041 నాటికి అది 1.5 శాతం చేరనుంది.
విద్యుత్ వాహనాల విధానాలు రూపొందించిన అతి తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఉంది. ఏపీలో స్త్రీపురుషుల మధ్య కనీస వేతన వ్యత్యాసం తక్కువగానే ఉంది. ఇంటి పనుమనుషులకు 319 రూపాయలు చెల్లిస్తే.. సెక్యూరిటీ గార్డులకు 328 రూపాయలు ఇస్తున్నారు. అసోం, హిమాచల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పనుల మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో డయ్యూ డామన్, హిమాచల్‌ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఏపీ నిలిచింది. ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రాల్లో భూఉత్పాదక ఎక్కువ ఉన్నప్పటికీ సాగునీటి వినియోగ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. దీన్ని బట్టి సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలేదని అర్థమవుతుంది. సూక్ష్మ సేద్య పద్ధతుల వల్ల ఏపీలో 22.4 శాతం విద్యుత్, 28.8 శాతం ఎరువుల ఆదా జరిగింది. పెట్టుబడి లేని వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక , హిమాచల్ ప్రదేశ్ ముందున్నాయి. ఏపీలో ఈ విధానం మొదలుపెట్టిన తర్వాత పెట్టుబడి ఖర్చులు భారీగా తగ్గి, పంటల దిగుబడి పెరిగింది. మార్కెటింగ్ ఇతర రైతు అనుకూల సంస్కరణల అమలులో ఏపీలో 7, తెలంగాణ 9వ స్థానంలో నిలిచాయి. 2తెలుగురాష్ట్రాల్లో 100 శాతం చౌకధరల దకాణాల కంప్యూటీకరణ పూర్తైంది. ఏపీలో సేవల రంగం బలంగా లేకపోయినా గత కొన్నేళ్లంగా ఆ రంగంలో మేలైన వృద్ధి నమోదు చేసింది. 2013-17మధ్య కాలంలో ఈ రంగంలో ఏపీ 9.2 శాతం, తెలంగాణ 10.7 వృద్ధి నమోదు చేశాయి. ఆంధ్రప్రదేశ్ లోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో భారతీయ ఆరోగ్య ప్రమాణాలు పాటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details