చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుతూ హోమం తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి... చంద్రబాబు సీఎం కావాలంటూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఆ పార్టీ నేతలు హోమం చేపట్టారు. శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వరస్వామి ఆలయంలో 'సుదర్శన యాగం, నవగ్రహం హోమం, రుద్రహోమం' నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిరుమావిళ్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీ పట్నం ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. తెదేపా అఖండ మెజార్టీతో గెలుపొంది విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ విశేష పూజలు నిర్వహించారు.