'ముఖ్యమంత్రికి తన మంత్రులపై పట్టు లేదు' - ap cm jagan
సీఎం జగన్‌కు తన మంత్రులపై పట్టు లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు.
tulasi reddy
వారం రోజులుగా ముఖ్యమంత్రి జగన్‌కు, మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి తన మంత్రులపై పట్టు లేదన్న తులసిరెడ్డి... రాజధానిపై ఎందుకు స్పష్టత ఇవ్వటంలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల వల్ల కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకునే పరిస్థితులు కనబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.