ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ పథకాలకు మీడియా వక్రభాష్యం చెప్పకూడదు'

ప్రభుత్వ పథకాలకు మీడియా వక్రభాష్యం చెప్పకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కుతుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు. తప్పుడు వార్తలు రాస్తే, పరువు నష్టం దావా వేయాలని గత ప్రభుత్వమే చెప్పిందని ఆయన తెలిపారు.

'ప్రభుత్వ పథకాలకు మీడియా వక్రభాష్యం చెప్పకూడదు'

By

Published : Oct 18, 2019, 5:54 PM IST

Updated : Oct 18, 2019, 9:02 PM IST

'ప్రభుత్వ పథకాలకు మీడియా వక్రభాష్యం చెప్పకూడదు'

మీడియా గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న తెదేపా వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు.ఏ పత్రికైనా,సామాజిక మాధ్యమమైనా ప్రభుత్వ పథకాలకు వక్రభాష్యం చెప్పకూడదని అన్నారు.ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.తప్పుడు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేయాలని గత ప్రభుత్వమే చెప్పినట్లు గుర్తు చేశారు.ప్రభుత్వ శాఖలపై ఏం రాసినా పట్టించుకోవద్దా!అని ప్రశ్నించిన ఆయన,తాము కొత్తగా ఏ చట్టం చేయలేదని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక ఏ మీడియా ప్రతినిధిని సమావేశాలకు రావద్దని చెప్పలేదని బొత్స పేర్కొన్నారు.తెదేపా అధినేత చంద్రబాబే కొన్ని మీడియా సంస్థల్ని సమావేశాలకు రావద్దని బెదిరించారని ఆరోపించారు.

ఉగాది నుంచి అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో వచ్చే ఉగాది నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

జగన్ 'వ్యక్తిగత మినహాయింపు'పై నవంబరు 1న తీర్పు

Last Updated : Oct 18, 2019, 9:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details