రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సబ్ రిజిస్ట్రార్లు యథాతథంగా కొనసాగించుకోవచ్చని.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలను కొన్ని జిల్లాల్లో గ్రామ,వార్డు సచివాలయ కార్యదర్శులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 17 న జారీచేసిన వివిధ జీవోలను సవాలు చేస్తూ..NTR జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామ ప్రసాద్ హైకోర్టులో పిల్ వేశారు. రిజిస్ట్రేషన్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ అధికారాలు కట్టబెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సచివాలయ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ అధికారం, విద్యార్హత లేవన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ .. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను తొలగించలేదని తెలిపారు. అధికారాలను తొలగించామంటూ..పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సబ్ రిజిస్ట్రార్‌లతో పాటు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు..రిజిస్ట్రేషన్ అధికారం కల్పించినట్లు వివరించారు. 51 మంది గ్రామ కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్లుగా నోటిఫై చేశామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 5,6 కి అనుగుణంగా ప్రభుత్వం అధికారాన్ని వినియోగించి కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ అధికారం కల్పించిందన్నారు. అయితే...ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని..ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది .
సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు తొలగింపు ఆరోపణలు అవాస్తవం: ప్రభుత్వం - ఏపీ లేటెస్ట్
సబ్ రిజిస్ట్రార్లు అధికారాలు తొలగించామన్న ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సబ్ రిజిస్ట్రార్లు యథాతథంగా కొనసాగించుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హైకోర్టు