తమిళనాడులో 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తుల అమ్మకం వెనుక భారీ కుట్ర దాగి ఉందని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆరోపించారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే ఘనుడు సీఎం అని దుయ్యబట్టారు.
'శ్రీవారి ఆస్తుల అమ్మకం వెనుక భారీ కుట్ర' - శ్రీవారి ఆస్తుల అమ్మకాలు
తిరుమల శ్రీవారికి వివిధ ప్రాంతాల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్మడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తమిళనాడులో 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తుల అమ్మకం వెనుక భారీ కుట్ర దాగి ఉందని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆరోపించారు.
ఆఖరికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో శ్రీవారి జోలికి వెళ్లినవారి పరిస్థితి ఏమైందో సీఎం జగన్ కి తెలుసని గుర్తుచేశారు. హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగించాల్సిన పుణ్య స్థలాలను వేలం వేసి హిందువుల మనోభావాలు, హిందుత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. వైకాపా ప్రభుత్వానికి ఇది శ్రేయస్కరం కాదని హితవుపలికారు. తక్షణమే శ్రీ వారి ఆస్తుల వేలం నిర్ణయాన్ని తితిదే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'తితిదే భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలి'