కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం స్పందనకు వచ్చిన ఫిర్యాదులపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులపై సకాలంలో స్పందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.
అధికారులకు సీఎం దిశానిర్దేశం
మండల స్థాయి నుంచి అవినీతిని అరికట్టాలని సీఎం సూచించారు. మీ-సేవాలో సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలన్నారు. లంచం ఇస్తే గానీ పనికావట్లేదనే ఫిర్యాదులు అందకూడదని అధికారులతో చెప్పారు. కిందిస్థాయి అధికారులకు కౌన్సిలింగ్ ఇచ్చి... అవినీతికి పాల్పడకుండా చేయాలని అన్నారు. సీఎం కార్యాలయం నుంచి మండలస్థాయి వరకూ అవినీతిరహిత పాలన అందించే ప్రయత్నం జరగాలని తెలిపారు.