కొత్తూరు తాడేపల్లిలో గోశాల ఘటనపై పశు సంవర్ధశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమీక్షించారు. అర్హతలు లేని వ్యక్తి గోశాల పశువైద్యాధికారిగా ఉండడంపై పూనం విస్మయం చెందారు. మూగజీవాల మృత్యుఘోషకు విష ఆహారమే కారణమై ఉండొచ్చని, తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని వంద పశువులు దాటిన గోశాలలన్నింటిని తనీఖీ చేస్తామని చెప్పారు. ప్రతి గోశాలను రిజిస్ట్రేషన్ చేసి, పశువులకు అందిస్తోన్న ఆహారం,వైద్య సేవలను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఉదంతాలు ఎక్కడా చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.
గోశాలలన్నింటికి రిజిస్ట్రేషన్: పూనం మాలకొండయ్య
విజయవాడ కొత్తూరు తాడేపల్లిలో గోసంరక్షణ కేంద్రాన్ని పశు సంవర్ధశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సందర్శించారు. గోవుల మృతిపై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు లు వచ్చాక అసలు కారణం తెలుస్తుందని ఆమె తెలిపారు.
గోశాలను పర్యవేక్షిస్తున్న పశుసంవర్థక శాఖా ముఖ్య కార్యదర్శి