కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బందిని ఓ సైకో వేధింపులకు గురి చేస్తున్నాడు. నియోజకవర్గ ఐసీడీఎస్ పరిధిలో సుమారు 20మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారు వినియోగిస్తున్న ప్రభుత్వ చరవాణికి ఓ వ్యక్తి ఫోన్ చేసి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కంకిపాడు ఐసీడీఎస్ అధికారిణికి ఫిర్యాదు చేయగా... వారు పోలీసులతో రహస్యంగా విచారణ చేయిస్తున్నట్లు సమాచారం.
'అంగన్వాడి సిబ్బందికి చరవాణి ద్వారా వేధింపులు' - icds
కంకిపాడు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బందిని ఓ గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లకు కాల్ చేస్తూ అసభ్య పదజాలం వాడుతూ తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'అంగన్వాడీ సిబ్బందికి చరవాణి ద్వారా వేధింపులు'
కేవలం అంగన్వాడీ సిబ్బందితోనే ఇలా ప్రవర్తిస్తున్నాడా లేక వేరే వారిని సైతం వేధిస్తున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన చరవాణికి ఏ ఫోన్ వచ్చినా... అది వేధింపులకు గురి చేసే వ్యక్తిది అయి ఉంటుందేమో అని సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.