ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2021, 12:50 PM IST

ETV Bharat / state

స్థానిక ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు యత్నిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని చండ్రగూడేం గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచ్​ అభ్యర్థి ఓటర్లకు బిర్యానీతో భోజనాలు ఏర్పాటు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

An ongoing wave of temptations in local elections in andraparesh
స్థానిక ఎన్నికల్లో కొనసాగుతున్న ప్రలోభాల పర్వం

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల తొలి దశ పోలింగ్​ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని చండ్రగూడెంలో అధికార పార్టీ సర్పంచ్​ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఓటర్లకు బిర్యాని పంచుతూ.. నిబంధనలను అతిక్రమించారు.

ఓటింగ్​ రోజున సర్పంచ్ అభ్యర్థి బిర్యానీ పంచడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలు ఎన్నికల నియమావళికి విరుద్దమని పేర్కొన్నారు. సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

ABOUT THE AUTHOR

...view details