కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ ఆదేశాలతో నూజివీడు మండలం లీలా నగర్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విస్సన్నపేట వైపు నుంచి వస్తున్న ఆటో, ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 335 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. న్యాయస్థానానికి తరలిస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత
రాష్ట్రంలో భారీగా మద్యం ధరలు పెరిగినందున మద్యం అక్రమ రవాణాకు తెర లేచింది. సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా మద్యాన్ని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా లీలానగర్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత