జగన్ తన 22నెలల పాలనలో జాతీయ పతాకం స్ఫూర్తిని ఎక్కడా చాటలేదని మాజీమంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. త్రివర్ణ పతాకం కాపాడే అర్హత లేదంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ప్రతి సంఘటనలోను ప్రజాస్వామ్యాన్ని మంటగల్పారన్నది సుస్పష్టమన్నారు. ఈ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవటానికే జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి, కుటుంబ సభ్యులను సన్మానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలను సంస్కరించుకునే ముందు చేసిన తప్పులు ఒప్పుకోవాలన్నారు. మాచర్ల ప్రజలకు జగన్.. చేసిన అన్యాయం మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'జగన్ తన పాలనలో జాతీయ పతాకం స్ఫూర్తిని ఎక్కడా చాటలేదు' - కృష్ణా జిల్లా వార్తలు
జగన్ తన 22నెలల పాలనలో జాతీయ పతాకం స్ఫూర్తిని ఎక్కడా చాటలేదని మాజీమంత్రి ఆలపాటి రాజా విమర్శించారు.ప్రతి సంఘటనలోను ప్రజాస్వామ్యాన్ని మంటగల్పారని ఆరోపించారు.ఈ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవటానికే పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'జగన్ తన పాలనలో జాతీయ పతాకం స్ఫూర్తిని ఎక్కడా చాటలేదు'