విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ బాధితులతో ఆ సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు 48 గంటల విజ్ఞాపన దీక్షలు చేపట్టారు. అగ్రిగోల్డ్ స్థలాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి బాధితులకు న్యాయం చేయలన్నారు. 20వేల రూపాయలకుపైన డిపాజిట్లు ఉన్న బాధితులకు తక్షణమే 50శాతం మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలవాలని బాధితులు యత్నించినా ఫలితం లేకపోవడంతో విజ్ఞాపన దీక్షలు చేపట్టామన్నారు. ప్రభుత్వం చెల్లించామని చెప్తున్న 10 వేల రూపాయలలోపు బాధితులకు పూర్తిస్థాయి ఆ మొత్తం అందలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని సంవత్సరం గడిచిన అమలు చేయకపోవడంతో బాధితులు నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి - Agrigold victims 48 hours of protest in Vijayawada
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ స్థలాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి