ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం అడ్వైజరీ కౌన్సిల్

రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​తో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వ శాఖల పునర్వవ్యవస్థీకరణ కోసం ఈ అడ్వైజరీ కౌన్సిల్ పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

advisory council reforms are initializing for state develpoment says it minister gowtham reddy
రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు

By

Published : Jun 24, 2020, 7:57 PM IST

రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, పటిష్టత కోసం హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​తో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వ శాఖల పునర్వవ్యవస్థీకరణ కోసం ఈ కౌన్సిల్ పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఐఎస్​బీ సౌజన్యంతో ప్రభుత్వాలు మారినా విధానాల్లో మార్పు లేకుండా ఉండే వ్యవస్థ తీసుకురానున్నట్టు మంత్రి తెలిపారు. దీనిపై అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, ప్రొఫెసర్లకు అడ్వైజరీ కౌన్సిల్​లో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు.

ప్రతీ 15 రోజులకు ఒకసారి అడ్వైజరీ కౌన్సిల్ సమావేశమవుతుందని మంత్రి తెలిపారు. పాలనా సంస్కరణలతోనే ప్రస్తుత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పారదర్శకత, జవాబుదారీతనంతో చేసే ప్రతీ అంశాన్నీ ప్రజలముందు ఉంచుతామని వెల్లడించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తోడ్పాటుతో డిజిటల్ టెక్నాలజీ, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధిలోనూ కొత్తమార్పులు తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి:

'దొంగ పనులు చేసేది వాళ్లే.. దొంగా దొంగా అనేదీ వాళ్లే'

ABOUT THE AUTHOR

...view details