ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు నేలపై విరిసిన పద్మాలు.. 12 మందిని వరించిన పురస్కారాలు - పద్మభూషణ్‌

Padma awards : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను 106 పద్మ పురస్కాలు ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని వరించాయి.

padma awards
padma awards

By

Published : Jan 25, 2023, 10:42 PM IST

Padma Awards: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల(Padma awards)ను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి; కమలేశ్‌ డి పటేల్‌ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని పద్మశ్రీ వరించింది.

పద్మశ్రీలు ఆంధ్రప్రదేశ్​..

  • సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు)
  • సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ)
  • కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు)
  • అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)
  • ప్రకాశ్ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగం)
  • సి.వి.రాజు (కళలు)
  • గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)

పద్మభూషణ్​ తెలంగాణ..

  • చినజీయర్ స్వామికి పద్మభూషణ్‌ పురస్కారం
  • కమలేశ్ డి.పటేల్‌కు పద్మభూషణ్‌ పురస్కారం

పద్మశ్రీలు తెలంగాణ..

  • బి.రామకృష్ణారెడ్డి
  • ఎం.విజయగుప్తా
  • పసుపులేటి హనుమంతరావు

వీరితో పాటు ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గతేడాది అక్టోబర్‌లో కన్నుమూశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details