దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఆలయ తాళాలు ధ్వంసం చేసి ...లోపలికి ప్రవేశించి పవిత్రమైన నందీశ్వరుని విగ్రహాన్ని పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న సామినేని ఉదయభాను ఆలయంలోని నందీశ్వరుని విగ్రహాన్ని పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి... నిందితులను పట్టుకునేలా ఆదేశాలు ఇస్తామన్నారు.
'దేవాలయాలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు'
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు నందీశ్వరుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను శిక్షించి తీరుతామని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు.
జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను