కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో వరుస చోరీలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం గ్రామంలోని లాక్ రోడ్డులో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి స్థానికుల సహకారంతో పోలీసులకు దొరికాడు. ఈ ఘటన మరవకముందే కంకిపాడు మసీదు సమీపంలో శైలజ అనే మహిళ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. శైలజ తన కుమార్తె ఇంటికి వెళ్లి ఉదయం వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువాలో దాచిన 30 వేల నగదు, బంగారం, వెండి అపహరణకు గురయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
వరుస చోరీలతో హడలెత్తిపోతున్న ప్రజలు - krishna district, kankipadu
కృష్ణాజిల్లాలో వరుస చోరీలు కొనసాగుతున్నాయి. ఊరెళ్లి తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు దొంగలు. వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
కంకిపాడులో వరుస చోరీలు