కృష్ణాజిల్లాలోని గన్నవరంలో తాపీ పని చేస్తున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గన్నవరం విద్యుత్తు సబ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
విద్యుదాఘాతానికి గురైన యువకుడు - electric shock latestnews at krishna
కృష్ణాజిల్లాలో తాపీ పని చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
విద్యుదాఘాతానికి గురైన యువకుడు
పని చేసే ప్రదేశంలో విద్యుత్ వైర్లు కిందకి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆ విద్యుత్తు తీగలు సరిచేయమని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. వర్షాలు వస్తే వారికి కూడా విద్యుత్ షాక్ కొడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని సరి చేయాలని కోరారు.
ఇదీ చదవండి:పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు