కృష్ణాజిల్లాలోని నందిగామ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కేసర బ్రిడ్జి వద్ద వెళ్తున్న టీవీఎస్ వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన మందాడి మాలకొండ రెడ్డి... స్వగ్రామానికి వెళ్తుండగా... కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - నందిగామ వద్ద జాతీయ రహదారి పై ప్రమాదం
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు... ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటన కృష్ణాజిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారి వద్ద జరిగింది.
రోడ్డు ప్రమాదం
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అక్రమార్కుల ధన దాహానికి.. అమాయకుడు బలి