పవన్ వాహన శ్రేణిలో బైక్‌పై ఉత్సాహంగా అనుసరిస్తున్న ఓ అభిమాని ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యాడు. రెండు కార్ల మధ్య ఇరుక్కుపోగా.... కాలు విరిగి బాధతో విలవిల్లాడాడు. పామర్రు మండలం కనుమూరు వద్ద ర్యాలీ సాగుతుండగా చోటుచేసుకున్న ఈ ఘటనతో కాసేపు ఆందోళన నెలకొంది.
పవన్ ర్యాలీలో అపశృతి... విరిగిన అభిమాని కాలు - pawan kalyan car rally news
కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ కారు ర్యాలీలో అపశృతి దొర్లింది. ద్విచక్రవాహనంపై ఉన్న పవన్ అభిమాని... రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో అతడి కాలు విరిగింది.
పవన్ ర్యాలీలో అపశృతి