Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధం
14:54 May 24
గుడివాడ ముబారక్ సెంటర్‌లోని గోదాములో మంటలు
Fire Accident: కృష్ణాజిల్లా గుడివాడలోని ఓల్డ్ ఎలక్ట్రికల్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ముబారక్ సెంటర్ వలివర్తిపాడు రోడ్డులోని కాజా ఓల్డ్ ఎలక్ట్రికల్ గోడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రూ.లక్షల విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధమయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని రెండు గడ్డివాములు, రెండు ఇళ్లు ఆహుతయ్యాయి. మధ్యాహ్నం సమయంలో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోడౌన్లో చెలరేగిన మంటలు... పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానిక ప్రజల కలవరపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇవీ చదవండి: