బైక్ పై విన్యాసం...తెచ్చింది ప్రాణాపాయం - road
ఓ రైతు ద్విచక్రవాహనం పై విన్యాసాలు చేస్తూ రోడ్డు మీద వెలుతున్నాడు. ఆ తరువాత చూస్తే కారు ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. రైతుని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ రైతు వివరాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది.
a-former-got-an-accident-due-to-bike-ride
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం-జూపూడి రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో....రైతుకు తీవ్రగాయాలయ్యాయి.ద్విచక్రవాహనంపై వెళ్తున్న రైతును కారు ఢీకొంది.క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు.రైతు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రమాదానికి కొద్దిసేపటిముందు ద్విచక్రవాహనంపై విన్యాసాలు చేస్తూ సరదాగా ముందుకు నడిపారు.ఈ దృశ్యాలను వాహనదారులు చరవాణిలో చిత్రీకరించారు.