కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన సిరివేది శివరామకృష్ణ అనే రైతు.. చేసిన అప్పులను తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని.. రైతు సంఘం నాయకులు నందిగామ మార్చురీ ముందు ధర్నా చేపట్టారు.
'మృతిచెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి' - విజయవాడ తాజా వార్తలు
కృష్ణా జిల్లా చెవిటికల్లు గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నందిగామ మార్చురీ వద్ద ధర్నా చేపట్టారు.
శివరామకృష్ణ పదెకరాలు ఈ ఏడాది కౌలుకు తీసుకున్నాడు. అందులోని ఐదెకరాల్లో పత్తి, మిగిలిన దాంట్లో మిర్చిని సాగు చేశాడు. అకాల వర్షాల కారణంగా పంట సరిగ్గా పండకపోగా.. పండిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. చేసిన అప్పులు తీర్చలేక.. తీవ్ర మనస్థాపానికి గురైన రైతు... పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరణించిన శివరామకృష్ణ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పిల్లల చదువులు, రైతు చేసిన రూ.6 లక్షల అప్పును ప్రభుత్వమే భరించాలని కోరారు.