కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ వరకు అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టారు. రోడ్డు అభివృద్ధి పేరుతో తమ భూములు ఆక్రమిస్తున్నారని....అక్రమంగా పొలాలు, వాగుల సరిహద్దులు తొలగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నవరం: ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం - కృష్ణా జిల్లా వార్తలు
రోడ్డు అభివృద్ధి పేరుతో భూముల ఆక్రమిస్తున్నారంటూ... రైతులు ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో చోటుచేసుకుంది.
ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం