కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామ సమీపంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి కారులో తరలిస్తున్న 468 (70 ఫుల్, 398 క్వాటర్) మద్యం బాటిళ్లను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
468 మద్యం బాటిళ్ల సీజ్... ఒకరి అరెస్ట్ - కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం వార్తలు
మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. ధరల వ్యత్యాసంతో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా ఏపీకి తరలించి విక్రయిస్తున్నారు. కృష్ణా జిల్లా గండ్రాయి వద్ద అక్రమంగా తరలిస్తున్న 468 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లాలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు