విజయవాడ వాంబేకాలనీ ఎక్స్ఎల్ ప్లాంట్ సమీపంలో మూడు ఆటోలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకతాయిలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో 2 ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఆటోలకుగ్యాస్ ట్యాంక్లు ఉండటం వల్ల ప్రమాద సమయంలో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. మంటలు ఆర్పివేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.