ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడులో ఉద్రిక్తత.. వైకాపా, తెదేపా నేతల సవాళ్లు..! - నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు

144 section in nuziveedu: కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత నెలకొంది. ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామని.. వైకాపా ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు విసురుకున్నారు.

144 section in nuziveedu
నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు.. వైకాపా, తెదేపా నేతల సవాళ్లు

By

Published : Mar 19, 2022, 12:32 PM IST

నూజివీడులో వైకాపా, తెదేపా నేతల సవాళ్లు

144 section in nuziveedu: కృష్ణా జిల్లా నూజివీడులో అధికార వైకాపా ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య సవాళ్లతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకునేందుకు ఇవాళ సాయంత్రం 4గంటలకు బహిరంగ చర్చలకు సిద్ధమని సవాళ్లు విసురుకున్నారు. ఇరువర్గాలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో.. పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. నూజివీడులో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది.

ABOUT THE AUTHOR

...view details