ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీపీఎం వందో వార్షికోత్సవం.. లాల్ జెండా ఆవిష్కరణ

సీపీఎం 100 వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ జిల్లా నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ పార్టీ సామాన్య ప్రజానీకానికి ఉండాల్సిన హక్కులపై అనేక పోరాటాలు నిర్వహించిందని పశ్చిమ కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు కె. దుర్గారావు తెలిపారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

సీపీఎంకు 100వ పుచ్చినరోజు.. జెండా ఆవిష్కరించిన నేతలు
సీపీఎంకు 100వ పుచ్చినరోజు.. జెండా ఆవిష్కరించిన నేతలు

By

Published : Oct 17, 2020, 4:12 PM IST

భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వాంబే కాలనీ 60వ డివిజన్, డీ బ్లాక్ వద్ద సీపీఎం నేతలు పార్టీ జెండా ఆవిష్కరణ చేపట్టారు. దేశంలో పేద, మధ్యతరగతి, రైతు, వ్యవసాయ, సామాజిక, కార్మికవర్గ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ ముందు భాగాన నిలబడింది తమ పార్టీయేనని సీపీఎం పశ్చిమ కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు కె. దుర్గారావు వెల్లడించారు. కేంద్రంలోని ప్రస్తుత భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాషాయ సర్కార్ కాలరాయాలని చూస్తోందని మండిపడ్డారు.

నవంబర్​లో రాజకీయ క్యాంపెయిన్..

నవంబర్ 7 నుంచి 15 వరకు దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ఒంటెద్దు విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి:

12 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య!

ABOUT THE AUTHOR

...view details