Godavari flood: వరద తగ్గినా ముంపు వదలడంలేదు. ఈ ఏడాది వరదలు సీజన్లో వరుసగా జులై, ఆగస్టు, సెప్టెంబరు మూడు నెలల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదలతోడు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాలతోపాటు లోతట్టు గ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినాపురం గ్రామానికి ఆనుకున్న ప్రధాన మేజర్ డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణకు గురి కావడంతో గోదావరి వరద నీటితో పాటు అధిక వర్షాలుతోడై నీరుదిగే మార్గం లేక పల్లంప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీ, చిన్నమెట్లంక, హై స్కూల్ రోడ్డు గ్రామాల్లోని వీధుల మధ్య నీరునిలిచి ఇళ్లల్లోకి కూడా ప్రవేశించింది. నాలుగు రోజులుగా నీరు నిలిచి ఉండిపోవడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పూడిక తీయించి.. ఆక్రమణలు తొలగించి భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు.
Godavari flood: వరద తగ్గినా... ముంపులోనే లంక గ్రామాలు
Godavari flood: గోదావరి వరదలతో పాటు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు గ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. కోనసీమ జిల్లా అయినాపురం గ్రామంలోని వీధుల్లో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి ప్రవేశించాయి. నాలుగు రోజులుగా నీరు నిలిచిపోవడంతో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి వరదలు