SNAKE : అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలోని ఓ పశువుల పాకలోని గడ్డివాములో నాగత్రాచు ప్రత్యక్షమైంది. బుసలు కొడుతున్న శబ్ధం వినిపించడంతో గమనించిన స్థానికులు పామును చూసి భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ గణేష్ శర్మకు సమాచారం అందించారు. సుమారు అరగంట పాటు శ్రమించి దానిని బయటకు లాగి డబ్బాలో బంధించటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పశువులను కాటేసి ఉంటే ఆర్థికంగా ఎంతో నష్టపోయేవారమని ఆందోళన వ్యక్తం చేశారు.
గడ్డివాములో నాగత్రాచు కలకలం.. బంధించిన స్నేక్ క్యాచర్
SNAKE IN HAYSTACK :అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఓ గడ్డివాములో ఆరుడగుల నాగత్రాచు కలకలం సృష్టించింది. బుసలు కొడుతున్న శబ్ధం విన్న స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారమందించారు.
SNAKE IN HAYSTACK