ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి: పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు

పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారం రావులపాలెంలో పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడిన రుద్ర రాజు ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి వంతపాడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిందేంటో ప్రజలకు తెలుసనీ.. బీజేపీ నాయకులకు మాత్రం అమ్మడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.

PCC president Gidugu Rudra Raju
పీసీసీ అధ్యక్షుడు రుద్ర రాజు

By

Published : Dec 31, 2022, 5:06 PM IST

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గిడుగు రుద్ర రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారం రావులపాలెం రావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి కళా వెంకటరావు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు గిడుగు రుద్రరాజు పూలమాల వేసిన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలతో కూడిన చట్టాన్ని ఏర్పాటు చేస్తే అనంతరం వచ్చిన రాజకీయ పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి అన్నారు. కోనసీమ వాసుల చిరకాల కోరిక అయిన కోనసీమ - నరసాపురం రైల్వే లైన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పునాది వేస్తే ప్రస్తుతం ఈ ప్రభుత్వాలు నీరుగార్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రాహుల్ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చేస్తారన్నారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కళ్యాణ్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో పాదయాత్రలు చేపడుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details