ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీపీఎస్, జీపీఎస్ వద్దు.. ఓపీఎస్సే ముద్దు: ప్రభుత్వ ఉద్యోగులు - సీపీఎస్ జీపీఎస్ వద్దు ఓపీఎస్సే ముద్దు

Government Employees Protest in konasima: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీయూటీఎఫ్) ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 'సీపీఎస్, జీపీఎస్ వద్దు.. ఓపీఎస్సే ముద్దు' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

mummedivaram employees
సీపీఎస్, జీపీఎస్ వద్దు.. ఓపీఎస్సే ముద్దు

By

Published : Dec 28, 2022, 4:07 PM IST

Government Employees Protest in konasema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీపీఎస్‌ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్‌ను అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీయూటీఎఫ్) ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తానన్న ఓపీఎస్ విధానానికి మంగళం పాడుతూ సీపీఎస్, జీపీఎస్ అంటూ కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ముమ్మిడివరంలోని విద్యాశాఖ కార్యాలయం నుండి రెండు కిలోమీటర్లు నడిచి తమ నిరసన తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణానికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'సీపీఎస్, జీపీఎస్ వద్దు-ఓపీఎస్సే ముద్దు' అంటూ నినదించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ విధానాలను మార్చుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details