ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tension at Kakinada: కాకినాడ రైతు పోరుబాట కార్యక్రమంలో ఉద్రిక్తత - Rythu Porubata program

Tension in Kakinada Rythu Porubata program
Tension in Kakinada Rythu Porubata program

By

Published : May 11, 2023, 4:50 PM IST

Updated : May 11, 2023, 7:00 PM IST

16:46 May 11

టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు రైతుల ర్యాలీ

కాకినాడ రైతు పోరుబాట కార్యక్రమంలో ఉద్రిక్తత

Tension at Kakinada: కాకినాడ కలక్టరేట్​ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టీడీపీ నాయకులు రైతు పోరుబాట కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, టీడీపీ నాయకులు వచ్చారు. కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయం నుంచి మొదలు పెట్టి కలెక్టరేట్‌ వరకు కొనసాగించాలని మొదలు పెట్టారు. అయితే రైతుల ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో.. నగరంలోని జడ్పీ సెంటర్‌ వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ర్యాలీలో ఉద్రిక్తత, గందరగోళం మొదలైంది. పోలీసులతో రైతులకు, టీడీపీ నేతలకు వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు వారికి అడ్డంగా బారికేడ్లు పెట్టారు. రైతులు, టీడీపీ నాయకులు వాటిని తోసుకుని కలెక్టరేట్ వైపు వెళ్లడం జరిగింది.. ఈ ఆందోళనలో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయాడు.

Last Updated : May 11, 2023, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details