ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలి 'కార్తిక సోమవారం' - శిమనామ స్మరణలతో మార్మోగిన శైవక్షేత్రాలు - భీమేశ్వర స్వామి వారికి పంచామృతంతో అభిషేకాల

Shaivakshetras are Mesmerized with Shimanama Remembrances : కార్తిక సోమవారం భక్తుల శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజామున నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. క్యూలైన్లు, వ్రత మండపాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

karthika_masam_celebrations
karthika_masam_celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 4:05 PM IST

Shaivakshetras are Mesmerized with Shimanama Remembrances: కార్తికమాసం మొదటి సోమవారం కావడంతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళల దీపారాధన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థానం వారు ప్రత్యేక క్యూలెన్లులను ఏర్పాటు చేశారు. భక్తులంతా నదులలో పుణ్యస్నానాలు చేసి దీపారాధన చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

తొలి కార్తిక సోమవారం - శిమనామ స్మరణలతో మార్మోగిన శైవక్షేత్రాలు

kakinada dist : కాకినాడ జిల్లాలోని సత్యనారాయణ స్వామి ఆలయం, సామర్లకోట భీమేశ్వర పుణ్యక్షేత్రం, పిఠాపురం పాదగయ, కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయ క్షేత్రాలు భక్తుల రాకతో కిక్కిరిపోయాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మహిళల దీపారాధనలతో దేవాలయాలు దర్శనం ఇచ్చాయి. యానంలో మహిళలు అరటి డొప్పలలో దీపాలను వెలిగించి గోదావరి నదిలోకి వదిలారు. ఆలయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సిబ్బంది, పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

Annavaram Satyanarayana Swamy Kartikamasam celebrations: పవిత్ర కార్తికమాసం మొదటి సోమవారం కావడంతో కాకినాడ జిల్లాలోని నలుమూలల నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ లు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వ్రతాలు, సర్వదర్శనలు ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాటు చేసినట్లు దేవస్థాన ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు.

Samarlakota Bhimeswara shrine Kartikamasam celebrations : పంచారామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోట భీమేశ్వర పుణ్యక్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భీమేశ్వర స్వామి వారికి పంచామృతంతో అభిషేకాలతో పూజలు నిర్వహించారు. బాల త్రిపురి సుందరి అమ్మవారికి కుంకుమార్చనతో పూజలు చేశారు. భక్తులకు పరమశివుడు యోగమూర్తిగా దర్శనమిచ్చారు. పిఠాపురం పాదగయ క్షేత్రానికి, కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పిఠాపురం శక్తిపీఠం పురుహూతికా అమ్మవారి ఆలయంలో రద్దీ నెలకొంది.

Union Territory of Yanam Kartikamasam celebrations : కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని.. గౌతమి గోదావరి తెల్లవారుజామున నుంచి భక్తులతో కిక్కిరిసిపోతోంది. మహిళలు తమ కుటుంబ సభ్యులతో జల్లు స్నానాలు చేసి నది ఒడ్డున పూజలు చేశారు. అనంతరం అరటి డొప్పలలో దీపాలు పెట్టి గౌతమి గోదావరి నదిలోకి వదిలారు. తమ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా డిప్యూటీ కలెక్టరు మునిస్వామి తగిన ఏర్పాటు చేశారు. ఆయనకు ప్రజా పనుల శాఖ.. మున్సిపాలిటీ అధికారులు సహకారాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details