ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా - కాకినాడ జిల్లా తాజా వార్తలు

MINISTER DHADISETTI RAJA: వాలంటీర్లు మనం పెట్టిన బచ్చాగాళ్లు.. వాళ్లు సరిగా పని చేయకపోయినా.. చెప్పినట్లు వినకపోయినా.. తీసి పారేయండి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు స్వయానా.. మంత్రి దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురులో జరిగిన వైకాపా ప్లీనరీలో.. మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

MINISTER DHADISETTI RAJA
MINISTER DHADISETTI RAJA

By

Published : Jul 6, 2022, 10:35 AM IST

MINISTER DHADISETTI RAJA: ‘జెండా మోసిన కార్యకర్తలే శాశ్వతం. వారిదే వైకాపా. నాయకులది కాదు...’ అని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్ల రాకతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందని, మనం పెట్టిన వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారని, మనమేమీ చేయలేకపోతున్నామంటూ పార్టీలోని నాయకులు అసంతృప్తికి గురవుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వాలంటీర్లను మనమే పెట్టామని, కార్యకర్తలకు నచ్చకపోయినా, ఎవరైనా సరిగా పని చేయకపోయినా తీసేయండని సూచించారు. గ్రామ కార్యదర్శులను అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలం నడకుదురులో మంగళవారం నిర్వహించిన కాకినాడ జిల్లా వైకాపా ప్లీనరీలో మంత్రి రాజా ఈ వ్యాఖ్యలు చేశారు.

నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి

ABOUT THE AUTHOR

...view details