Medical Student Died at Kakinada Railway Station: రైలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ.. కాలుజారి రైలు పట్టాలపై పడిపోవటంతో ఓ వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కాకినాడలో జరిగిన ఈ ఘటన జరగగా.. ఆమె తల్లిదండ్రుల అర్తనాదాలు మిన్నంటాయి. శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలు దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కాకినాడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ మాచవరానికి చెందిన ఎస్.సత్య తనూష అనే యువతి.. గుంటూరు జిల్లాలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ క్రమంలో కాకినాడలో నిర్వహిస్తున్న రంగరాయ వైద్య కళాశాలలో నిర్వహించే సదస్సులో పాల్గోనెందుకు బయల్దేరారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సు గురువారం ప్రారంభం కాగా.. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.
రైలు ఢీకొని బధిర బాలుడు మృతి
రైలు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత 2వ నెంబర్ ఫ్లాట్ ఫాంపై ఆగింది. రైలు దిగే క్రమంలో సత్య తనూష అదుపు తప్పి రైలు నుంచి పట్టాలపై పడిపోయింది. ఇంతలోనే రైలు కదిలింది. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు స్నేహితులు.. ఘటన చూసిన ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అది గమనించిన రైలులోని ప్రయాణికులు చైన్ లాగారు.
దాదాపు మీటరు దూరం వరకు కదిలిన రైలు చైన్ లాగటంతో ఆగిపోయింది. అప్పటికే ఆమె రైలు చక్రాలకు పట్టాలకు మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆమెతో ప్రయాణం చేసిన ఇద్దరు స్నేహితులు దుఃఖంలో మునిగిపోయారు. అంతవరకు వారితో ఉన్న తోటి స్నేహితురాలు విగతా జీవిగా మారటంతో వారు ఆవేదనకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Train Accident:నెల్లూరులో రైలు ఢీకొని.. రొట్టెల పండుగకు వచ్చిన తల్లి, కుమార్తె మృతి
మృతురాలి తండ్రి శ్రీనివాస్ మోహన్ సిద్ధా స్వస్థలం కాకినాడ కాగా.. కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. రెండో కుమార్తె ఇప్పుడు ఇలా విగతా జీవిగా మారిందని బోరున విలపించారు. తనూష ఎప్పుడు బయటకు వెళ్లినా కుటుంబంలో ఎవరమో ఒకరం తోడుగా వెళ్లేవారమని మృతురాలి తండ్రి విలపించారు. గురువారం ఎవరు తోడు లేకుండా బయటకు వెళ్లి మృత్యు ఒడిలోకి చేరుకుందని తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. తోడుగా వెళ్తానని తల్లి అడిగితే తానే వద్దన్నని మృతురాలి తండ్రి రోధించారు.
తాడేపల్లిలో రైలు ఢీ కొని ఇద్దరు మృతి