ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ భూమి బదలాయిస్తూ.. ఆమోదం - కాకినాడ జిల్లా తాజా వార్తలు

LAND: కాకినాడ జిల్లా కేంద్రంలో వైకాపా కార్యాలయానికి రెండెకరాల ప్రభుత్వ భూమిని బదలాయిస్తూ నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపింది. అయితే ప్రభుత్వ భూమిని ఎలా బదలాయిస్తారని ప్రశ్నిస్తూ... తెదేపా కార్పొరేటర్లు చర్చకు పట్టుపట్టారు. దీంతో తెదేపా, వైకాపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

LAND
వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ భూమి

By

Published : May 27, 2022, 8:31 AM IST

LAND: కాకినాడ జిల్లా కేంద్రంలో వైకాపా కార్యాలయానికి రెండెకరాల ప్రభుత్వ భూమిని బదలాయిస్తూ నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపింది. కాకినాడ అర్బన్‌ మండలంలోని రమణయ్యపేటలో ఆర్‌ఎస్‌ నంబరు 155/2-7బీలోని రెండు ఎకరాల భూమిని వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి స్థల బదలాయింపు చేయాలని కలెక్టర్‌ కోరగా, మేయర్‌ సుంకర శివప్రసన్న నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఆమోదించడానికి (ర్యాటిఫై చేయడానికి) మేయర్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ భూమిని ఎలా బదలాయిస్తారని ప్రశ్నిస్తూ... తెదేపా కార్పొరేటర్లు చర్చకు పట్టుపట్టారు. దీంతో తెదేపా, వైకాపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details