గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీకి నేతలు ధర్నా నిర్వహించారు. పేరేచర్ల ఎంపీటీసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు వందమంది వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పేరేచర్లలో ఇతర పార్టీలకు చెందిన వారికి.. అధికారులు మైనింగ్ ను లీజు కేటాయించారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్ ప్రాంతంలో వడ్డెరలు పనులు చేసుకొనేందుకు అనుకూలంగా జీవోలు ఇచ్చారని చెప్పారు. పేరేచర్లలో మైనింగ్ ను లీజుకు తీసుకున్న వ్యక్తులు.. తమను పనిలోకి రానివ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సమస్య విన్నవించిన పరిష్కారం కాలేదని వడ్డెర సంఘం నేతలు తెలిపారు.
పేరేచర్లలో మైనింగ్ లీజు ఇతర పార్టీల వారికి ఎలా ఇస్తారు..?
గుంటూరులోని వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద.. ఆ పార్టీ నేతలు ధర్నా చేశారు.పేరేచర్ల ఎంపీటీసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 100మంది ఆందోళనకు దిగారు. పేరేచర్లలో ఇతర పార్టీల వారికి అధికారులు మైనింగ్ లీజు కేటాయించారని ఆరోపించారు. గతంలో వడ్డెరలకు.. అనుకూలంగా ఉన్న జీవోలను తుంగలో తొక్కారని వాపోయారు.
వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతల ధర్నా