ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత' - ఎమ్మెల్యే శ్రీదేవి, సందీప్ వివాదంపై తాజా వార్తలు

ఎమ్మెల్యే శ్రీదేవి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైకాపా బహిష్కృత నేత సందీప్ ఆరోపించాడు. సీఎం జగన్ తనను కాపాడాలని సెల్ఫీ వీడియోలో బోరున విలపించారు. ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనని కాపాడాలని వేడుకున్నాడు.

ysrcp exiled leader Sandeep selfie video
వైకాపా బహిష్కృత నేత సందీప్ సెల్ఫీ వీడియో

By

Published : Nov 7, 2020, 11:45 AM IST

Updated : Nov 7, 2020, 11:52 AM IST

ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉందని వైకాపా బహిష్కృత నేత సందీప్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎమ్మెల్యే శ్రీదేవి తనపై అక్రమంగా కేసు పెట్టారని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. అక్రమ కేసులతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని.. తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారని విచారం వ్యక్తం చేశాడు.

సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియోలో సందీప్‌ ఆరోపించాడు. ఎమ్మెల్యే శ్రీదేవికి కష్టకాలంలో అండగా ఉంటే ఇప్పుడు తనను ఇబ్బందిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను కాపాడాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశాడు.

వైకాపా బహిష్కృత నేత సందీప్ సెల్ఫీ వీడియో

ఇదీ చదవండి: ఆ ఇద్దరి నుంచి ప్రాణహాని:. వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి

Last Updated : Nov 7, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details