ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

young woman suspicious death: యువతి అనుమానాస్పద మృతి.. హత్యా.. ఆత్మహత్యా..? - ఆత్మహత్య

suspicious death of young woman: యువతి అనుమానాస్పద మృతి ఆందోళనకు దారితీసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల తెల్ల క్వారీ కాలనీకి చెందిన తమ్మిశెట్టి సంధ్య(17) ఇంటికి సమీపంలోని కొండ వద్ద మృతదేహమై కనిపించింది. కాగా, తమ కూతురును హత్యచేసి ఉంటారని ఆరోపిస్తూ యువతి తల్లిదండ్రులు రహదారిపై ధర్నా చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 6, 2023, 8:12 PM IST

suspicious death of young woman: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ యువతి అనుమానాస్పద మృతి ఆందోళనకు దారి తీసింది. యువతి మృతదేహం క్వారీ వద్ద లభించగా.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. తమ కూతురుది ఆత్మహత్య కాదని, హత్యకు గురై ఉండొచ్చని ఆమె తల్లిదండ్రులు రహదారిపై ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించిన యువతి కుటుంబసభ్యులు, బంధువులు.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆత్మహత్యగా పేర్కొన్న పోలీసులు.. గుంటూరు రూరల్ నల్లపాడు ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి రామకోటి - దుర్గ దంపతులు కొన్నేళ్ల కిందట పేరేచర్లకు వలస వచ్చారు. రామకోటి-దుర్గ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె సంధ్య ఇంటర్ పూర్తి చేసికొన్నాళ్లుగా ఇంటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఇంటికి సమీపంలోని ఓ యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో మంగళవారం సంధ్యను ఆమె తల్లిదండ్రులు మందలించారు. కుటుంబ సభ్యులంతా రాత్రి ఇంట్లో నిద్రించగా.. పొద్దున్నే సంధ్య అదృశ్యమైంది.

ఆచూకీ కోసం వెతుకుతూ వెళ్లగా ఇంటికి సమీపంలోని మెటల్ క్వారీ కొండ కింద భాగంలో సంధ్య మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న నల్లపాడు సీఐ శ్రీనివాసరావు.. తన సిబ్బందితో కలిసి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన సంధ్య కొండ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనిభావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సంధ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం మృత దేహాహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.

మృతదేహంతో ధర్నా..తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ సంధ్య తల్లిదండ్రులు, బంధువులు మేడికొండూరు మండలం పేరేచర్ల కూడలిలో ధర్నా చేశారు. తమ కుమార్తె హత్యకు కారణమైన వ్యక్తుల్ని అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు మృతదేహంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా మృతురాలు తమ్మిశెట్టి సంధ్య కుటుంబ సభ్యులు, వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిందితులను పట్టుకుని చట్టపరమైన తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసిన పోలీసులపై తమకు నమ్మకం లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details