గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువకుడు కొండేద్దు విజయ మణికంఠ.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు అతని బంధువులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Accident: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి - గుంటూరు జిల్లా వార్తలు
A man died in brahmanapalli road accident: గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
a man died in accident