ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్ చేసిందని ఆరోపిస్తూ గుంటూరు నగర వైకాపా అధ్యక్షురాలు ఝాన్సీ... పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరుపతికి వస్తే స్వాగతం పలికిన సీఎం జగన్పై అసభ్యకర కామెంట్ చేశారని మండిపడ్డారు. అధికార ప్రతినిధి అయితే సంక్షేమ పథకాలు, ప్రభుత్య కార్యక్రమాలపై మాట్లాడాలని, సీఎంపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే సహించేది లేదని అన్నారు.
సాధినేని యామినిపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు - jagan
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాధినేని యామినిపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు
డీజీపీకి యామిని ఫిర్యాదు
జగన్పై అసభ్యకరంగా కామెంట్లు పెట్టింది తాను కాదని... తన పేరుతో ఎవరో నకిలీ ఖాతా తెరిచారని ఉదయమే డీజీపీకి యామిని ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సంబంధిత కథనం
దుష్ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి: యామినీశర్మ