ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP Leaders Want to Chance Heirs in Next Assembly Election: వారసుల కోసం వైసీపీ నేతల పోరు.. అధిష్టాన హామీ కోసం ఎదురుచూపులు..

YCP Leaders Want to Chance Heirs in Next Assembly Election: వైసీపీ నాయకులు తమ వారసులను.. వారి వారి స్థానాల్లో బరిలోకి దింపాలని కొందరు నేతలు తహతహలాడుతున్నారు. అందుకోసం అధిష్టానాన్ని ఆవకాశం ఇవ్వామని కోరుతున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నుంచి హామీ రాకపోతే.. ఇతర పార్టీల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు వెనకడాటం లేదు.

YCP_Leaders_Want_to_Chance_Heirs_in_Next_Assembly_Election
YCP_Leaders_Want_to_Chance_Heirs_in_Next_Assembly_Election

By

Published : Aug 21, 2023, 7:23 AM IST

YCP Leaders Want to Chance Heirs in Next Assembly Election: వారసుల కోసం వైసీపీ నేతల పోరు.. అధిష్టాన హామీ కోసం ఎదురుచూపులు..

YCP Leaders Want to Chance Heirs in Next Assembly Election: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీలో వారసత్వ యుద్ధం మరింత ముదురుతోంది. వారసులను బరిలో దింపేందుకు ఎమ్మెల్యేలు, నేతలు పోటీపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసులకే టికెట్ ఇవ్వాలంటూ కొందరు విన్నపాలు చేస్తుంటే.. మరికొందరు కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే ఏదైనా సరే అంటూ ఆఫర్లు ఇస్తున్నా.. అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టికెట్ తమవారికైతే సరేనంటున్న అధినాయకత్వం.. మిగతా వారి విషయంలో ఎటూ తేల్చడం లేదు.

"మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ.. స్వతంత్రంగానే రామచంద్రపురంలో బరిలోకి దిగుతా" ఇదీ వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అల్టిమేటం. "సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు, మరో మూడుసార్లు రామచంద్రపురంలో నేనే పోటీ చేస్తా’' ఇదీ మంత్రి వేణు మాట. "వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నా కుమారుడికి టికెట్‌ కేటాయించండి" అని భూమన కరుణాకర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సీఎం జగన్​ను పలు సందర్భాల్లో కోరుతున్నారు. రాజకీయాల నుంచి రిటైరవుతున్నా, మచిలీపట్నం టికెట్‌ నా కుమారుడికి ఇవ్వండి అంటూ.. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్‌తోనే నేరుగా చెప్పిన మాటలు.

YSRCP 2024 MLA Candidates First List వైసీపీ ఎమ్మెల్యేల ఫస్ట్​ లిస్ట్​కు ముహుర్తం ఫిక్స్​..! వారికి ఝలక్​ ఇవ్వనున్న సీఎం జగన్​..!​

టికెట్ల కోసం నేతల మధ్య వార్‌: వచ్చే ఎన్నికల్లో వారసులకే టికెట్‌ ఇవ్వాలంటూ.. వైసీపీ అధినాయకత్వంతో కొందరు.. మరొకొందరు నేరుగా ముఖ్యమంత్రికే విజ్ఞప్తులు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వారసులకు టికెట్ల కోసం నేతల మధ్య వార్‌ జరుగుతుండతా.. మరికొన్ని చోట్ల తమవారికి మాత్రం వైసీపీ అధిష్ఠానం లైన్‌ క్లియర్‌ చేస్తోంది. చంద్రగిరి టికెట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. తన కుమారుడు మోహిత్‌ రెడ్డికిచ్చేలా సీఎంతో ఓకే చేయించుకున్నారు.

ఆ ముగ్గురికి ఓకే: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కోరినట్లే ఆయనకు టీటీడీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. దీంతో భూమన కోరిక మేరకు ఆయన తనయుడు అభినయ్‌ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తిరుపతి టికెట్‌ ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వైసీపీ అధిష్ఠాన ప్రతినిధి, ఓ ముఖ్యనేత సూత్రప్రాయంగా ప్రకటించారు. దీంతో టికెట్లు దాదాపు ఖరారైన ముగ్గురూ ఒక సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావడం విశేషం.

అమలాపురం నుంచి నేనే పోటీ చేస్తా: మంత్రి పినిపే విశ్వరూప్​

అయితే కొంత మంది నేతల వారసులకు టికెట్ కేటాయింపుపై మాత్రం స్పష్టత రావడం లేదు. 'రాజకీయాల నుంచి రిటైరవుతున్నా, వచ్చే ఎన్నికల్లో కుమారుడు కృష్ణమూర్తికి టికెట్‌ ఇవ్వండి’ అని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సీఎంను కోరారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌.. తన తనయుడు, పోలాకీ జడ్పీటీసీ సభ్యుడు డాక్టర్‌ కృష్ణ చైతన్యకు టికెట్‌ కోసం పలుమార్లు సీఎంను కలిసి విజ్ఞప్తి చేసినా వీరిద్దరికీ టికెట్‌పై స్పష్టత రాలేదు.

అసంతృప్తిలో పలు నేతలు: వారసుల టికెట్‌లపై అధిష్ఠానం స్పష్టతనివ్వడం లేదని పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్‌ ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ముస్లిం ప్రతినిధులతో సమావేశం సందర్భంగా.. వైసీపీ పాలనలో మహిళలకు రాజకీయ ప్రాధాన్యమిస్తున్నాం.. అలా ముస్తఫా వారసురాలిని ప్రమోట్‌ చేస్తున్నామని సీఎం చేసిన వ్యాఖ్యలతో ఆమెకు టికెట్‌ ఖాయమని ముస్తఫా వర్గం భావిస్తోంది. కానీ అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది.

బాలయ్య ఫ్లెక్సీలో వైసీపీ ఎమ్మెల్యే.. జనం షాక్​

మంత్రి విశ్వరూప్‌ కోరిక తీరుతుందా : టెక్కలిలో పార్టీ సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ స్థానంలో ఆయన భార్య దువ్వాడ వాణిని.. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా. అప్పుడు మరొకరొస్తారా. అనేది వేచి చూడాలి. తన కుమారులు కృష్ణా రెడ్డి, డాక్టర్‌ శ్రీకాంత్‌లకు ఎవరికో ఒకరికి ఈ సారి టికెట్‌ ఇప్పించుకోవాలనుకుంటున్న మంత్రి విశ్వరూప్‌ కోరిక తీరుతుందా అనేదీ చూడాల్సి ఉంది.

ఎంపీ, ఎమ్మెల్యే ఏదైనా సరే: కొందరేమో ఎంపీ లేదా ఎమ్మెల్యే ఏదైనా సరేనంటూ ప్రతిపాదిస్తున్నా అధిష్ఠానం నుంచి స్పందన రావడం లేదు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన కుమారుడు ధర్మాన రామ్‌ మనోహర్‌నాయుడు, ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆయన తనయుడు చిరంజీవి వెంకటనాగ్, మంత్రి విశ్వరూప్, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస రెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితర నేతలు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లను తమ వారసులకోసం అడుగుతున్నారు.

2017లో దాడి..! వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కేసు నమోదు

త్రిమూర్తులపోరు: రామచంద్రపురంలో ముక్కోణపు పోటీ నెలకొనడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కుమారుడు సూర్యప్రకాష్‌ను, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు నరేన్‌ను, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొడుకు పృధ్వీని బరిలోకి దించేందుకు పోటీ పడుతున్నారు. సూర్యప్రకాష్‌కు ఈసారి టికెట్‌ ఇవ్వాలని బోస్‌ కోరుతుండగా.. సీఎం జగనే భరోసా ఇచ్చారని వచ్చే మూడు ఎన్నికల్లోనూ టికెట్‌ తమదేనని మంత్రి వేణు చెబుతున్నారు. ఈ మధ్యలోనే త్రిమూర్తులు సైతం తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సైతం ఇదే పరిస్థితి. టికెట్‌ను స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తన తనయుడికి ఖరారు చేయించుకోవాలనుకుంటుంటే.. ఇదే సీటును మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన కొడుకు ధరణీధర్‌ రెడ్డికి ఇవ్వాలంటూ పట్టుబట్టుతున్నారు. ‘రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే’అంటూ ధరణీధర్‌ రెడ్డి ఫ్లెక్సీలు అప్పుడప్పుడూ దర్శనమివ్వడంతో వార్ ముదురుతోంది.

ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్​గా డాక్టర్​ రఘు

వారసునికి లభించకపోతే స్వయంగా ఆయనే: నంద్యాల జిల్లా పాణ్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తన కొడుకు నరసింహారెడ్డికి టికెట్‌ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. పాణ్యం కోసం శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోటీ పడుతుండడంతో రాంభూపాల్‌ రెడ్డి సిద్ధార్థపై ఆగ్రహంతో ఉన్నారు. తన కొడుక్కు ఇవ్వకపోతే తానే బరిలో ఉంటా తప్ప ఇంకొకరికి టికెట్‌ పోనివ్వనని కాటసాని చెబుతున్నారు. ఇదే జిల్లాలోని శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తన కొడుకు కార్తీక్‌ రెడ్డిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. పాణ్యం కాకపోతే శ్రీశైలం టికెట్‌ తనకివ్వాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనడంతో వీరిద్దరికీ పొసగడం లేదు.

వైసీపీలో అవకాశం లేకపోతే.. ఇతర పార్టీల్లోకి: వారసులను బరిలోకి దించేందుకు సొంత పార్టీలో అవకాశం దక్కకపోతే బయట పార్టీల్లోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్రయత్నాల్లో కొందరు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు నేతలు తమ వారసులకు వైసీపీలో సీటు రాకపోతే జనసేన నుంచి బరిలోకి దిగేందుకు అటువైపు కూడా చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు కీలక నేతలు.. వైసీపీలో వారసులకు టికెట్ దక్కకపోతే టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరేకాకుండా మరికొందరు నేతలు సైతం వారసులకు టికెట్‌లు ఇప్పించుకునేందుకు పాట్లు పడుతున్నారు.

వారసులకు టికెట్లు కావాలని కోరుతున్న కొందరి నేతల వివరాలు..

  • శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె, విజయనగరం డిప్యూటీమేయర్‌ శ్రావణి
  • యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి కొడుకు సుకుమార్‌ వర్మ
  • ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ
  • గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొడుకు, కార్పొరేటర్‌ వంశీ
  • ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్‌ రెడ్డి
  • వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కొడుకు మాగుంట రాఘవ రెడ్డి పోటీ చేస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ఈసారికి మీరే పోటీ చేయాలి: వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్‌ ఇచ్చేది లేదు.. ఈ సారికి మీరే పోటీ చేయాలి అని గతేడాది ఆఖర్లో ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ పాలసీ పార్టీలోని తమవారికి ఒకలా, ఇతరులకు మరోలా ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుంది.. ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై వారసుల భవితవ్యం కోసం నేతలు పలు విధాలుగా సమాలోచనలు చేస్తున్నారు.

MLA Kona Raghupathi recording dance: రికార్డింగ్ డ్యాన్స్​లో వైసీపీ ఎమ్మెల్యేలు.. కోన రఘుపతి, మద్దిశెట్టి వేణుగోపాల్​

ABOUT THE AUTHOR

...view details