దళితుల ఇళ్లపై వైసీపీ నాయకుల దాడి YCP LEADERS ATTACK ON DALITS: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లయ్య పాలెంలో ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతికి తమను పిలవకుండా బయటివారిని ఆహ్వానించటం ఏంటని ఓ దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు వైసీపీ నాయకులు తమ ఇళ్లపై దాడులు చేశారని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీకి చెందిన శంకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కోటిరెడ్డి , సీతారామరెడ్డిలు తమ ఇళ్లపై దాడులకు దిగినట్లు దళిత యువకుడు నీలం సాగర్ పోలీసులకు ఐదు రోజుల క్రితం పిర్యాదు చేశాడు.
అయితే ఎస్సై రవీంద్రబాబు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే కేసు నమోదు చేస్తామని చెప్పినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో బాధితులు డీఎస్పీ ప్రశాంతి వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. ఆమె సూచన మేరకు నల్లపాడు ఎస్సై అశోక్ తమ వద్దకు వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. అయితే ఎస్సై అశోక్ వారితో అభ్యంతరకరంగా మాట్లాడినట్లు, ఆ విషయాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించాడు.
అనంతరం ఎస్సీ కమిషన్ స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత అతడు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌ను కలిసినట్లు బాధితుడు పేర్కొన్నారు. పాతమల్లాయపాలెంలో వైసీపీ నాయకులతో ఎస్పీ చర్చించి.. ప్రత్తిపాడు స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రత్తిపాడు సర్కిల్ స్టేషన్ చేసిన తరువాత తాను పరిశీలించలేదని, తనిఖీల కోసమే వచ్చినట్లు మీడియాకి ఎస్పీ చెప్పుకొచ్చారు. చివరకు ఫిర్యాదులో పేర్కొన్న వారిపై ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రబాబు తెలిపారు.
" ఈ రోజు మేము ప్రత్తిపాడు స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించాము. ప్రత్తిపాడులో సర్కిల్ ఆఫీసును ఏర్పాటు చేశాము. ఇంతకుముందు చేబ్రోలు వద్ద ఉండేది. మేము ఇప్పుడు ఈ సర్కిల్ ఆఫీసును విజిట్ చేసి క్రైమ్ రికార్డ్స్ అన్నీ చెక్ చేశాము. ఇప్పటికే యాక్సిడెంట్స్‌పై కూడా చర్చించుకుని తగిన జాగ్రత్తలు చేపట్టాము. దొంగతనాలపై కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఇంతకు ముందు దొంగతనాలకు పాల్పడిన వారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలను తెలుసుకుని చోరీ కేసులపై తగిన విధంగా దర్యాప్తు చేస్తున్నాము." - ఆరిఫ్ హఫీజ్, ఎస్పీ
ఇవీ చదవండి: